విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ రిలీజ్ డేట్ ఫిక్స్

vishwak sens mechanic rocky movie release date update

ఈఏడాది ఇప్పటికే గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. రెండు సినిమాలు కూడా డీసెంట్ హిట్లనే అందించాయి. ఇప్పుడు ఇదే జోష్ తో పలు సినిమాలను లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం తన లిస్ట్ లో లైలా, మెకానిక్ రాకీ అనే రెండు సినిమాలు ఉన్నాయి. వాటిలో లైలా సినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. రామ్ నారాయ‌ణ్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా.. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈసినిమాకు తనిష్క్ బగ్చి సంగీతం.. రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. అన్వర్ అలీ ఎడిటర్.. వాసుదేవ మూర్తి రైటర్ గా పనిచేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీనితోపాటు రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో మెకానిక్ రాకీ అనే సినిమాను చేస్తున్నాడు. ఈసినిమా కూడా ప్రస్తుతం షూటింగ్ దశలోనే ఉంది. అయితే చాలా రోజుల తరువాత ఇప్పుడు ఈసినిమాకు సంబంధించి క్రేజీ అప్ డేట్ తో వచ్చారు మేకర్స్. ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 31వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.

కాగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్‌ తాళ్లూరి నిర్మిస్తుండగా.. జేక్స్ బిజోయ్ మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నాడు. ఈసినిమా ఆలిండియా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్, ఏషియన్ సినిమాస్ దక్కించుకొని సంయుక్తంగా ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.