స్వాగ్ సింగరో సింగ సాంగ్ రిలీజ్

singaro singa full song released from sree vishnu swag movie

హసిత్ గోలి దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు హీరోగా వస్తున్న సినిమా స్వాగ్. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. మరోవైపు చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది. ఇప్పటికే వరుసగా పోస్టర్లు, గ్లింప్స్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. వచ్చిన అప్ డేట్లు అన్నీ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. రీసెంట్ గా రిలీజ్ చేసిన రేజర్ పేరుతో వచ్చిన గ్లింప్స్ అయితే మరింత ఆకట్టుకుంది. శ్రీవిష్ణు మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్నాడని అర్థమైంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు మరో అప్ డేట్ తో వచ్చారు. ఈసినిమా నుండి సింగరో సింగ అనే ఎనర్జిటిక్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈపాట కి సంబంధించిన ప్రోమోను మేకర్స్ నేడు రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ను ప్రముఖ సింగర్ అయిన బాబా సెహగల్ మరియు వైకొమ్ విజయలక్ష్మి లు పాడారు.

కాగా ఈసినిమాలో రీతూవర్మ హీరోయిన్ గా నటిస్తుండగా.. మీరా జాస్మిన్, దక్షా నగార్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవిబాబు, గెటప్ శ్రీను, గోపరాజు రమణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా.. వేద రామన్ శంకరన్ సినిమాటోగ్రఫర్ గా వ్యవహరిస్తున్నారు. జూలై ఫస్ట్ వీక్ లో ఈసినిమాను రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.