బ్రో తరువాత చాలా గ్యాప్ తీసుకున్నాడు యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్.నిజానికి ఈసినిమా తరువాత గాంజా శంకర్ చేయాల్సివుంది.అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది.సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో ఈసినిమాను సంపత్ నంది డైరెక్ట్ చేయాల్సి ఉండగా బడ్జెట్ కారణాల వల్ల పక్కన పెట్టేశారు. దాంతో సాయి ధరమ్ మరో సినిమాను ఓకే చేశాడు.అయితే ఈసారి కొత్త దర్శకుడి ఛాన్స్ ఇచ్చాడు.రోహిత్ డైరెక్షన్ లో తన 18వ సినిమా చేస్తున్నాడు.షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా బడ్జెట్ 100కోట్ల దాటనుందట.సాయి ధరమ్ కెరీర్ లో ఇదే హైయెస్ట్ బడ్జెట్.ఇప్పటివరకు చేసిన సినిమాల బడ్జెట్ 40 కోట్లు దాటలేదు.ఇప్పుడు తీస్తున్న సినిమాకు ఏకంగా 125కోట్లు పెట్టడానికి రెడీ అవుతున్నారు నిర్మాతలు.తేజ్ కు వున్న మార్కెట్ దృష్ట్యా ఈ బడ్జెట్ అంటే సాహసమే.అందులో కొత్త డైరెక్టర్.అయితే కంటెంట్ మీద వున్న నమ్మకంతో నిర్మాతలు బడ్జెట్ విషయంలో రాజీపడడం లేదట.
ఇది గనక వర్క్ అవుట్ అయితే సాయి ధరమ్ తేజ్ కు తిరుగుండదు.ఈసినిమా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది.హనుమాన్ నిర్మాతలు నిరంజన్ రెడ్డి ,చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు.వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: