విజయ్ దేవరకొండ -గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కొత్త షెడ్యూల్ ఈరోజు ప్రారంభమైంది.శ్రీలంకలో ఈ షెడ్యూల్ జరుగుతుంది.ఇందులో విజయ్ కూడా జాయిన్ అయ్యాడు.దాదాపు నెలకు పైగా ఈషెడ్యూల్ జరుగనుందట. ఇందులో యాక్షన్ సీన్స్ తోపాటు కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు.సెప్టెంబర్ లోపు షూటింగ్ ను కంప్లీట్ చేయనున్నారు.గ్యాంగ్ స్టార్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమాలో విజయ్ పోలీస్ గా కనిపించనున్నాడు.త్వరలోనే టైటిల్ ను రివీల్ చేయనున్నారు.ఇందులో మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా కాకుండా ప్రస్తుతం మరో రెండు సినిమాలకు సైన్ చేశాడు విజయ్ దేవరకొండ.అందులో రాజావారు రాణిగారు ఫేమ్ రవికిరణ్ కోలా తో ఓ సినిమా చేయనున్నాడు.రూరల్ బ్యాక్ డ్రాప్ లో మాస్ ఎంటర్టైనర్ గా రానుంది.దిల్ రాజు -శిరీష్ ఈసినిమాను నిర్మిస్తున్నారు.త్వరలోనే షూటింగ్ కూడా స్టార్ట్ కానుంది.
ఇక తనకు టాక్సీవాలా తో హిట్ ఇచ్చిన రాహుల్ సాంకృత్యాన్ తో మరో సినిమా చేయనున్నాడు విజయ్.ఇది రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ మూవీ గా తెరకెక్కనుంది.మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుంది.మరి ఈమూడు సినిమాలతో విజయ్ హ్యాట్రిక్ కొడతాడో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: