పెళ్లి చూపులు సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు ప్రియదర్శి. ఆతరువాత హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్స్, సపోర్టింగ్ రోల్స్ చేస్తూ బిజీ అయిపోయాడు. ఆ తరువాత హీరోగా మారి సినిమాలు చేస్తున్నాడు.ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా డార్లింగ్. అశ్విన్ రామ్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కింది. ఈసినిమా జులై 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. యంగ్ హీరో విశ్వక్ సేన్ ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశాడు. ట్రైలర్ ను బట్టి ఈసినిమా ఫుల్ కామెడీతో పాటు ఎమోషన్ ఎలిమెంట్స్ తో తెరకెక్కించినట్టు తెలుస్తుంది. పెళ్లి తర్వాతభార్యతో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనేది ఈ కథాంశంగా అర్థమవుతుంది. నభానటేష్ ను ప్రియదర్శిని పెళ్లి చేసుకుంటాడు.. తనని ఫారిన్ తీసుకెళ్లాలని అనుకుంటాడు.. అయితే నభా నటేష్ స్ప్లిట్ పర్సనాలిటీ వల్ల ప్రియదర్శి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనేది కామెడీ వే లో చూపించారు. ట్రైలర్ అయితే ఆకట్టుకుంటుంది. సినిమాపై క్యూరియాసిటీని పెంచేసింది. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం రిలీజ్ వరకూ వెయిట్ చేయాల్సిందే.
కాగా ఈసినిమాలో నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుంది. చాలా గ్యాప్ తరువాత ఈసినిమాలో నటిస్తుంది నభా. ఇంకా ఈ సినిమాలో మురళీధర్ గౌడ్, శివ రెడ్డి, కృష్ణ తేజ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. చైతన్య రెడ్డి సమర్పణలో నిరంజన్ రెడ్డి ప్రైమ్ షో ఎంటర్ టైనమెంట్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: