టాలీవుడ్‌లోని క్రేజీ కాంబినేషన్‌లలో ఒకటి స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ మరియు డైరెక్టర్ అనిల్ రావిపూడి. వీరి కలయికలో ఇంతకుముందు వచ్చిన ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ చిత్రాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలిసిన విషయమే. తాజాగా మరోసారి ఈ కాంబినేషన్‌లో కొత్త మూవీ రాబోతోంది. కాగా ఈ చిత్రాన్ని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ సినిమాలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. వెంకీ భార్యగా చీర కట్టులో ఐశ్వర్య రాజేశ్ గృహిణిలా ఉన్న లుక్‍ను ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ అందించింది చిత్ర బృందం. ఈ మూవీలో మరో కథానాయికగా ‘గుంటూరు కారం’ ఫేమ్ మీనాక్షి చౌదరి కూడా నటించనున్నట్లు తెలిపింది.
ఈ మేరకు సోషల్ మీడియాలో అఫీషియల్ గా ప్రకటించింది. వెంకీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్‌గా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో మీనాక్షి చౌదరి చేతిలో గన్ ఉండగా ఆమె పోలీసాఫీసర్ పాత్ర పోషించనున్నట్టు అర్థమవుతోంది. ఈ పోస్టర్‌లో గన్ పక్కన గులాబీ ఉంది. ఈ మూవీలో వెంకటేష్ మాజీ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు.
ఎక్సలెంట్ వైఫ్, ఎక్స్ కాప్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మధ్య జరిగే కథతో ట్రయాంగిల్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందనున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. ఇక ఈ చిత్రంలో నటించనున్న ఇతర నటీనటులు, పనిచేయనున్న సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబోలో వస్తోన్న హ్యాట్రిక్ చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























