ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా కల్కి 2898ఏడీ. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఈసినిమా కథ, విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు, మహాభారతం సన్నివేశాలకు స్పెషల్ అప్లాజ్ వస్తుంది. దీంతో ఫస్ట్ షో నుండే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. కలెక్షన్స్ పరంగా ఈసినిమా ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూద్దాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా రిలీజ్ అయి ఇప్పటికి నాలుగు రోజులు పూర్తి చేసుకుంది. నాలుగు రోజుల్లో ఈసినిమా 500 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. మొదటి రోజు ఈసినిమా 191 కోట్లను కలెక్ట్ చేయగా రెండు రోజుల్లో 298 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది.. మూడు రోజుల్లో 415 కోట్లు కలెక్ట్ చేసింది. మొదటి రోజు 95 కోట్లను సొంతం చేసుకోగా 2,3 రోజుల్లో కలెక్షన్స్ కాస్త తగ్గాయి. ఇక నాలుగవ రోజు 85 కోట్లను రాబట్టుకుంది. దీంతో నాలుగు రోజుల్లో 500 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఇక నాలుగు రోజులకు గాను ఈసినిమా 555 కోట్లు కలెక్ట్ చేసుకుంది.
కాగా ఈసినిమాలో ప్రభాస్, దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ, సస్వతా ఛటర్జీ, శోభన, అన్నా బెన్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈసినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా.. జోర్డ్జే స్టోజిల్జ్కోవిచ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. ఈసినిమాను తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























