అభిమానులు ముద్దుగా ‘థలా’ అని పిలుచుకునే కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’, ‘విడా ముయార్చి’ అనే భారీ బడ్జెట్ సినిమాలలో ఆయన హీరోగా నటిస్తున్నాడు. గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. ‘మార్క్ ఆంటోనీ’ ఫేమ్ అద్విక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక మరోవైపు విడా ముయార్చి సినిమాను మగిజ్ తిరుమనేని డైరెక్షన్ చేస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ చిత్రాల అప్డేట్ల కోసం ‘థలా’ ఫ్యాన్స్ ఇంట్రెస్టింగ్గా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే గుడ్ బ్యాడ్ అగ్లీ నుంచి సెకండ్ లుక్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో చేతిపై టాటుతో అజిత్ మాస్‌గా కనిపించి అభిమానులను అలరించాడు. ఈ నేపథ్యంలో తాజాగా విడా ముయార్చి నుంచి బిగ్ సర్ప్రైజ్ అందించింది చిత్ర యూనిట్. ఆదివారం రాత్రి ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను రివీల్ చేసింది. హైవేపై చేతిలో బ్యాగ్ పట్టుకుని స్టైల్‌గా నడుచుకుంటూ వస్తున్న అజిత్ పోస్టర్ ఆకట్టుకుంటోంది.
కాగా విడా ముయార్చి చిత్రంలో త్రిష హీరోయిన్గా నటిస్తుండగా.. సీనియర్ నటుడు అర్జున్ సర్జా, అరుణ్ విజయ్, ఆండ్రియా జెర్మియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ గ్రాండ్‌గా నిర్మిస్తోంది. కాగా విడా ముయార్చి ఈ ఏడాది చివరిలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























