పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. ఫ్యూచరిస్టిక్ ఎపిక్ మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి టాలీవుడ్ విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. జూన్ 27న దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొనగా.. అందుకు తగ్గట్లే తొలి ఆటతోనే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీంతో ఈ విజువల్ వండర్ విడుదలైన అన్నిచోట్లా మ్యాసీవ్ రెస్పాన్స్‌తో గ్లోబల్ వైడ్‌గా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఇదేక్రమంలో నార్త్ ఇండియాలోనూ కల్కి మూవీ అదరగొడుతోంది. బాహుబలి నుంచే హిందీ బెల్ట్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్.. తాజాగా కల్కితో మరోసారి ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రభంజనం సృష్టిస్తున్నాడు. ఇప్పటికే ఈ ఏడాది హిందీలో తొలిరోజు వసూళ్ళలో అత్యధిక నెట్ అందుకున్న రెండో సినిమాగా కల్కి రికార్డ్ సృష్టించింది.
ఈ నేపథ్యంలో తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. కల్కి చిత్రం ఫస్ట్ వీకెండ్‌లో అదరగొట్టింది. మొత్తం నాలుగు రోజుల్లో ఈ మూవీ రూ. 115 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించింది. ఈ మేరకు మేకర్స్ సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. కాగా ప్రస్తుతం ఢిల్లీ, ముంబై సహా పలు ఉత్తరాది రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ, కల్కి ఈ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టడం గమనార్హం.
ఇక ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే కథానాయికగా నటించగా.. ఇండియన్ లెజెండరీ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్ మరియు కమల్ హాసన్ కీలక పాత్రల్లో కనిపించారు. అలాగే దిశాపటానీ, మాళవిక నాయర్, బెంగాలీ నటుడు స్వాస్థ్ ఛటర్జీ, రాజేంద్రప్రసాద్, పశుపతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్‌ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























