ప్రధాని మోదీకి వరలక్ష్మీ పెళ్లి ఆహ్వానం

varalaxmi sarathkumar invites pm narendra modi for her wedding

తమిళ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కెరీర్ ను స్టార్ట్ చేసినా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే ఎక్కువ బిజీ అయిపోయింది వరలక్ష్మీ శరత్ కుమార్. ఇప్పుడు తమిళ్ లో కంటే తెలుగులోనే ఎక్కువ అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. గోపీచంద్ మలినేని క్రాక్ మూవీతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది వరలక్ష్మీ శరత్ కుమార్. ఆ తరువాత వరుసగా సినిమాలను అందిపుచ్చుకుంటూ కెరీర్ లో దూసుకుపోయింది. హనుమాన్ తో ఈ ఏడాది వరలక్ష్మి మరో సక్సెస్ ను అందుకున్నారు. ప్రస్తుతం అయితే పలు సినిమాలు తన లిస్ట్ లో ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మరోవైపు వరలక్ష్మీ శరత్ కుమార్ గత కొద్దిరోజులుగా పెళ్లి పనులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. నికోలాయ్ సచ్ దేవ్ అనే వ్యక్తితో తన వివాహం జరగనుంది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వీరిద్దరి నిశ్చితార్ధం మార్చిలో జరిగింది. జూలైలో వీరి వివాహం జ‌రుగ‌నున్న‌ట్లు స‌మాచారం. ఇదిలా ఉండగా వరలక్ష్మీ శరత్ కుమార్ సెలబ్రిటీలను కలిసి స్వయంగా తన పెళ్లికి ఆహ్వానిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే తమిళ్ తో పాటు తెలుగు సినీ పరిశ్రమలో చాలా మంది సెలబ్రిటీలకు ఆహ్వాన పత్రిక అందించారు. ఈనేపథ్యంలోనే తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధానమంత్రి మోదీని కలవడం జరిగింది. వరలక్ష్మీ శరత్ కుమార్, తండ్రి శరత్ కుమార్, రాధిక, తన కాబోయే భర్త నికోలయ్ సచ్‌దేవ్ లతో మోదీని కలిసి తన రిసెప్షన్ కి రమ్మని ఆహ్వాన పత్రికను ఆందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.