ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు కల్కి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ మైథాలజీ నేపథ్యంలో వచ్చిన సినిమా ఇది. ఈసినిమాపై మొదటినుండీ భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఆ అంచనాలను నిజం చేస్తూ రిలీజ్ అయిన ఫస్ట్ షో నుండే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంటూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ సినిమాపై ప్రశంసలు కురిపించకుండా ఉండలేకపోతున్నారు. నాగ్ అశ్విన్ ఐడియాను.. దానిని తెరపై చూపించిన విధానానికి ఫిదా అవుతున్నారు మేకర్స్. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ ను రాబట్టుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా గురించి నిర్మాత అశ్వినీ దత్ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు. కల్కి సినిమా కాస్టింగ్ లో కమల్ హాసనే లాస్ట్ లో జాయిన్ అయ్యారు.. నాగ్ అశ్విన్ ఈసినిమా కథను కమల్ కు నెరేషన్ ఇస్తున్నప్పుడే ఈసినిమా పార్ట్1, పార్ట్ 2 వచ్చేసింది అని అన్నారు. అంతేకాదు ఈసినిమా పార్ట్ 2 ఇప్పటికే 60శాతం పూర్తయిందని..ఇంకా కొన్ని మేజర్ పోర్షన్స్ షూట్ చేయాల్సి ఉంది.. రిలీజ్ డేట్ మాత్రం ఇంతవరకూ డిసైడ్ అవ్వలేదు అని తెలియచేశారు.
కాగా ఈసినిమాలో ప్రభాస్, దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ, సస్వతా ఛటర్జీ, శోభన, అన్నా బెన్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈసినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా.. జోర్డ్జే స్టోజిల్జ్కోవిచ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. ఈసినిమాను తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: