కల్కి పార్ట్ 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా – రజినీకాంత్

Super Star Rajinikanth Says, I am Eagerly Awaiting For Part 2 Kalki 2898 AD

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధానపాత్రలో ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 AD భారీ అంచనాల నడుమ గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. అంచనాలకు తగ్గట్లే ఈ విజువల్ వండర్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. ప్రభాస్ నటనకు తోడు కీలక పాత్రల్లో కనిపించిన బిగ్ బి, కమల్ హాసన్, దీపికా పదుకొణె స్క్రీన్ ప్రజెన్స్ చిత్రానికి ప్లస్ అయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో ఫ్యూచరిస్టిక్ ఎపిక్ మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కిన కల్కి తొలిరోజు వసూళ్ల సునామీనే సృష్టించింది. ఇండియాలోనే కాకుండా ఓవర్‌సీస్‌లో సైతం డాలర్ల వర్షం కురిపించింది. తద్వారా 191 కోట్లకు పైగా గ్రాస్ సాధించి దేశవ్యాప్తంగా మొదటిరోజు ఎక్కువ కలెక్షన్స్ సాధించిన మూడో చిత్రంగా కల్కి రికార్డ్ నెలకొల్పింది. ఈ సందర్భంగా కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కల్కి చిత్రంపై ప్రశంసలు కురిపించారు.

ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన.. “కల్కి చూశాను. వావ్! వాట్ యాన్ ఎపిక్! దర్శకుడు నాగ్ అశ్విన్ ఇండియన్ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లాడు. నా ప్రియ స్నేహితుడు అశ్విని దత్‌కి, అమితాబ్ బచ్చన్, ప్రభాస్ రాజు, కమల్ హాసన్, దీపికా పదుకొణే మరియు కల్కి 2898 AD బృందం మొత్తానికి హృదయపూర్వక అభినందనలు. పార్ట్ 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. మీ అందరికీ ఆ దేవుడి ఆశీస్సులు లభించుగాక” అని పేర్కొన్నారు.

కాగా వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్‌ అశ్వనీదత్‌ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే హీరోయిన్‌గా నటించగా.. ఇండియన్ లెజెండరీ యాక్టర్స్ అమితాబ్‌ బచ్చన్‌ మరియు కమల్‌ హాసన్‌ కీలక పాత్రల్లో కనిపించారు. అలాగే దిశాపటానీ, మాళవిక నాయర్, బెంగాలీ నటుడు స్వాస్థ్ ఛటర్జీ, రాజేంద్రప్రసాద్‌, పశుపతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.