ఏడాది చివరిలో కంగువ రిలీజ్ ప్లాన్?

interesting buzz on suriyas kanguva movie release date

డిఫరెంట్ సినిమాలను తీయడానికి ఇష్టపడే హీరోల్లో తమిళ్ స్టార్ హీరో సూర్య ముందుంటాడు. ప్రస్తుతం పలు సినిమాలు సూర్య లిస్ట్ లో ఉండగా అందులో కంగువ సినిమా కూడా ఒకటి. స్టార్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో సూర్య హీరోగా ఈసినిమా వస్తుంది. ఈసినిమా హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌‌లో.. ఈ సినిమా 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమాలో సూర్య పలు గెటప్స్ లో కనిపిస్తాడన్న విషయం తెలిసిందే. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమా రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మేకర్స్ నుండి ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ఈమధ్య రిలీజ్ డేట్ పై నిర్మాత ధనంజయన్ మాట్లాడుతూ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేయాలో మాకు తెలుసు.. ఎకనామిక్ గా కొన్ని అంచనాలు ఉంటాయి అవన్నీ దృష్టిలో పెట్టుకొని రిలీజ్ డేట్ లని అనౌన్స్ చేస్తాము అంటూ స్పష్టం చేశాడు. ఈనేపథ్యంలో మరోసారి రిలీజ్ డేట్ పై ఒక ఇంట్రెస్టింగ్ వార్త తెరపైకి వచ్చింది. ఈసినిమాను ఈ ఏడాది చివరిలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. క్రిస్మస్ పండుగ సందర్భంగా రిలీజ్ ను ప్లాన్ చేయాలని.. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

కాగా ఈసినిమాలో సూర్య సరసన దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాని స్టూడియో గ్రీన్ తో పాటు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ సంస్థ యు.వీ క్రియేషన్స్ కూడా కలిసి నిర్మిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మొత్తం 3డీ వర్షెన్‌లో పలు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. మరి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈసినిమా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.