దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ నడుస్తోంది. ‘కల్కి 2898 AD’ చిత్రం గురించే. ఈ సినిమాతో టాలీవుడ్ స్థాయి మరింతగా పెరుగుతుందని తెలుగు చిత్ర పరిశ్రమ భావిస్తోంది. పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ మోస్ట్ అవైటెడ్ మూవీకి క్రియేటివ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ నాగ్అశ్విన్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కథ అన్ని ప్రాంతాలవారికీ రిలేటెడ్ గా ఉంటుందని, అన్ని దేశాలవారు దీనిని ఓన్ చేసుకుంటారని ఆయన ఇప్పటికే ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వైజయంతీ మూవీస్ పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కల్కి ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఇక ఇండియన్ స్క్రీన్‌పై ఇంతవరకూ రానటువంటి కథాంశంతో విజువల్ వండర్‌గా ఇది రూపొందినట్లు మేకర్స్ ఇదివరకే తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు నాగ్ అశ్విన్‌పై ఇప్పుడు అందరి దృష్టి పడింది.
దీనికి కారణం.. నాగ్ అశ్విన్ ఇప్పటివరకు కేవలం రెండు సినిమాలకే దర్శకత్వం వహించారు. అయితే ఆ రెండింటికి పలు అవార్డులు వచ్చాయి. ఆయన తొలిసారి డైరెక్షన్ చేసిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో ఉత్తమ తొలి దర్శకుడిగా నంది అవార్డును గెలుచుకున్నాడు. అలాగే ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ (సెకండ్) – ప్రియాంక దత్, స్వప్నా దత్, ప్రత్యేక జ్యూరీ అవార్డు – విజయ్ దేవరకొండ, ఉత్తమ గీత రచయిత – రామజోగయ్య శాస్త్రికి నంది అవార్డులు లభించాయి.
ఇక దీని తర్వాత రెండో సినిమాగా దివంగత లెజెండరీ నటి సావిత్రి బయోపిక్ ‘మహానటి’ని తెరకెక్కించారు నాగి. ఈ చిత్రమైతే ఏకంగా జాతీయ స్థాయిలో సత్తా చాటింది. తెలుగుకి సంబంధించి ఉత్తమ ఫీచర్ ఫిల్మ్, కీర్తికి ఉత్తమ నటి మరియు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ విభాగాల్లో జాతీయ అవార్డులు లభించాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మూడో సినిమాగా కల్కిని రూపొందించారు నాగ్ అశ్విన్.
కల్కి కథ పరంగా కూడా విభిన్నంగా ఉండనుంది. ద్వాపరయుగం నాటి మహాభారత కాలం నుంచి భవిష్యత్తులోని క్రీ.శ. 2898 వరకూ ఈ స్టోరీ ముడిపడి ఉంటుంది. హాలీవుడ్ సినిమాల స్థాయిలో విజువల్స్ ఉన్నాయని అంటున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ మైథాలజీ-ఇన్స్పైర్డ్ సైన్స్ ఫిక్షన్ మూవీతో ఈసారి నాగి ఇంటర్నేషనల్ అవార్డు కొట్టేస్తాడని మూవీ లవర్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు. సో.. మనం కూడా ఈ చిత్రం భారీ విజయం సాధించాలని, అలాగే గ్లోబల్ వైడ్‌గా అవార్డులతో సత్తా చాటాలని కోరుకుందాం.
కాగా మల్టీలింగ్వెల్గా తెరకెక్కిన కల్కి 2898 AD చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొణే, దిశాపటానీ కథానాయికలుగా నటించారు. ఇండియన్ లెజెండరీ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్ మరియు కమల్‌హాసన్ కీలక పాత్రల్లో కనిపించనుండగా.. బెంగాలీ నటుడు స్వాస్థ్ ఛటర్జీ, రాజేంద్రప్రసాద్, పశుపతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. రేపు ఉదయం బెనిఫిట్ షోలతో కల్కి ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























