సాధారణంగా సినిమాలో విలన్ పాత్ర అంటే ఎలా ఉంటుందో తెలిసిందే. ఆ పాత్రకు ఎలాంటి ఎథిక్స్ లేకుండా ఉంటాయి. కానీ నెగెటివ్ రోల్స్ కు కూడా ఎథిక్స్ ఉండాలి అంటున్నాడు విలక్షణ నటుడు విజయ్ సేతుపతి. వరుస సినిమాలతో ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు విజయ్ సేతుపతి. మంచి సినిమాలు, పాత్రలు ఆయన్ని వెతుక్కుంటూ వెళతాయో లేక తనే అలాంటి కథలను ఎంచుకుంటాడో తెలీదు కానీ మ్యాగిమమ్ సక్సెస్ రేటు ను సొంతం చేసుకుంటాడు. హీరో గా చేసినా, విలన్ గా చేసినా ఏ పాత్ర చేసినా ఆ పాత్రకు న్యాయం చేస్తాడు. ఇక ఇప్పుడు మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు విజయ్ సేతుపతి. తాను రీసెంట్ గా చేసిన సినిమా మహారాజా. ఈసినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేశారు. ఈసినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. అంతేకాదు ఇప్పటికే 50 కోట్ల క్లబ్ లోకి కూడా చేరిపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ సేతుపతి నెగెటివ్ పాత్రల గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంటర్వ్యూలో భాగంగా విలన్ పాత్రలు చేస్తున్నప్పుడు మీకు నచ్చని విషయాలు ఏమైనా ఉంటాయా అని అడుగగా.. దానికి విజయ్ సేతుపతి ఖచ్చితంగా ఉంటాయి.. మనం సినిమా అందరి కోసం తీస్తున్నాం.. అందుకే చాలా జాగ్రత్తగా తీయాలి.. ఆడియన్స్‌కి మనం ఎలాంటి కథనైనా చెప్పొచ్చు.. కానీ దాంట్లో విలువలు ఉండాలి. విలన్ రోల్ అయినా సరే అందులో కూడా కొన్ని ఎథిక్స్ ఉండాలి. అలానే నెగెటివ్ రోల్స్ ఎవరి మనోభావాలను దెబ్బతీయకూడదు అంటూ క్లారిటీ ఇచ్చాడు.
కాగా నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో వచ్చిన ఈసినిమాలో ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్, మలయాళ నటి మమతా మోహన్ దాస్, అభిరామి, దివ్య భారతి, మునీష్ కాంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్యాషన్ స్టూడియోస్ బ్యానర్‌పై జగదీష్ పళని స్వామి, సుదన్ సుందరమ్ నిర్మించిన ఈసినిమాకు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























