స్వయంవరం స్వయంగా నన్నే వరించింది – విజయ్ భాస్కర్

Director K Vijaya Bhaskar Reveals Interesting Facts About Swayamvaram

టాలీవుడ్ లోని టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్స్‌లో సీనియర్ దర్శకుడు కె విజయ్ భాస్కర్ ఒకరు. థియేటర్లో ఇంటిల్లిపాదీ కలిసి చూసేలా క్లీన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లు చేయడం ఆయన ప్రత్యేకత. 1991లో ‘ప్రార్థన’ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసిన ఆయన కెరీర్‌లో చేసింది కొన్ని సినిమాలే అయినా, వాటిలో చాలా వరకు ప్రేక్షకుల ఆదరణ పొందాయి. ‘స్వయంవరం’, ‘నువ్వే కావాలి’, ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మన్మధుడు’, ‘మల్లీశ్వరి’ ‘జై చిరంజీవ’ వంటి సూపర్ హిట్ చిత్రాలు విజయ్ భాస్కర్ రూపొందించినవే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ క్రమంలో తాజాగా ఆయన మరో కొత్త సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ‘ఉషా పరిణయం’ అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో విజయ్ భాస్కర్ తనయుడు శ్రీ కమల్ హీరోగా నటిస్తుండటం విశేషం. యువ నటి తన్వీ ఆకాంక్ష ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. వెన్నెల కిషోర్, శివాజీరాజా, ఆమని, సుధ, ఆనంద్ చక్రపాణి, రజిత, బాలకృష్ణ, సూర్య, మధుమణి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కాగా ఈ ఈ మూవీని క్రాఫ్ట్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించనుంది.

ఈ నేపథ్యంలో డైరెక్టర్ విజయ భాస్కర్ చిత్ర ప్రమోషన్స్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా తాజాగా తెలుగు ఫిల్మ్ నగర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన గత చిత్రాలకు సంబంధించిన పలు విశేషాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా విజయ్ భాస్కర్ ‘స్వయంవరం’ సినిమా గురించి కొన్ని ఆసక్తికర సంఘటనలను గుర్తుచేసుకున్నారు. ఆ సినిమా అవకాశం తనకు ఎలా వచ్చిందో? చిత్రీకరణ సమయంలో తనకెదురైన అనుభవాలను తెలియజేసారు.

ఈ సందర్భంగా దర్శకుడు విజయ్ భాస్కర్ మాట్లాడుతూ.. “దర్శకుడిగా ప్రార్థన నాకు తొలి చిత్రం. కానీ ఇది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీని తర్వాత నాకు ఏడేళ్లు గ్యాప్ వచ్చింది. మళ్ళీ స్వయంవరం మూవీకి దర్శకత్వం వహించే అవకాశం లభించింది. అయితే వాస్తవానికి స్వయంవరం స్వయంగా నన్నే వరించింది. దీనికోసం నేను ఎలాంటి ప్రయత్నం చేయలేదు. అప్పటికే రెండు రోజుల షూటింగ్ జరిగి ఆగిపోయింది. ఆ సమయంలో ప్రొడ్యూసర్స్ నాకు ఈ ప్రాజెక్ట్ అప్పగించారు” అని తెలిపారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “తొలుత వద్దని అన్నా.. ఆ తర్వాత సినిమాలో కొన్ని మార్పుచేర్పులకు వారు అంగీకరించారు. అప్పుడే నాకు టీమ్ ఏర్పడింది. త్రివిక్రమ్ నాకు అక్కడే పరిచయం అయ్యారు. అలాగే హీరో వేణు, హీరోయిన్ లయ ఇద్దరూ ఇండస్ట్రీకి కొత్తవాళ్లే. వందేమాతరం శ్రీనివాస్ గారు టెర్రిఫిక్ మ్యూజిక్ అందించారు. ఉదిత్ నారాయణ్, సోనూ నిగమ్ పాడిన సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఈ టీమ్ చాలా సహకరించింది. దీంతో సినిమా అద్భుతంగా వచ్చింది. నా హృదయంలో స్వయంవరానికి ప్రత్యేక స్థానం ఉంది” అని అన్నారు.

కాగా 1999లో విడుదలైన స్వయంవరం సినిమా సూపర్ హిట్ అందుకుంది. హీరో, హీరోయిన్స్ కొత్తవారైనా కథ, కథనం బావుండటంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. చాలా కేంద్రాలలో 100 రోజులకు పైగా ప్రదర్శించబడింది. ఇక ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీతో తొలిసారిగా మాటల రచయితగా వెండితెరకు పరిచయమయ్యారు. ఇందులో ఆయన రాసిన డైలాగ్స్‌కి అపూర్వ స్పందన లభించింది. ప్రత్యేకించి సంభాషణల్లో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది స్వయంవరం. నేటికీ ఈ చిత్రంలోని కామెడీ సీన్స్ ప్రజలను అలరిస్తుంటాయి. ఎస్పీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వెంకట శ్యామ్ ప్రసాద్ నిర్మించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.