ది గోట్ – సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

thalapathy vijay the goat movie second single release date fixed

దళపతి విజయ్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈసినిమా వస్తున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ను ఇప్పటికే మొదలుపెట్టిన సంగతి తెలిసిందే కదా. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్. విజిల్ పోడు అనే పాటను రిలీజ్ చేయగా.. ఆపాట సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. విజయ్ తో పాటు ప్రశాంత్, ప్రభుదేవా కూడా ఈపాటలో ఉండటంతో ప్రత్యేకంగా ఆకర్షించింది. తాజాగా సెకండ్ సింగిల్ కు సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. చిన్న చిన్న కంగల్ అంటూ వచ్చే సెకండ్ సాంగ్ ను జూన్ 22వ తేదీన సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.

కాగా సినిమాలో విజయ్ కు జోడీగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా స్నేహ, ప్రశాంత్, ప్రభుదేవా, జైరాం, లైలా, కమెడియన్, అజ్మల్, యోగిబాబు, వైభవ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై అర్చన కల్పతి నిర్మిస్తున్నారు. యువన్‌శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నాడు. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.