నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, దీపికా పదుకొనే హీరో హీరోయిన్లుగా భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమా కల్కి. ఈసినిమా కోసం తెలుగు ప్రేక్షకులతో పాటు యావత్ ఇండియన్ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈసినిమా జూన్ 27వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ప్రమోషన్ కార్యక్రమాలు కూడా భారీ ఎత్తునే చేస్తున్నారు. ఇప్పటికే పలు అప్ డేట్లు రాగా అన్నీ మంచి రెస్పాన్స్ ను తెచ్చుకున్నాయి. స్టోరీ, ఇందులో వాడిన గ్రాఫిక్స్, ప్రభాస్ పాత్ర భైరవ వాడిన బుజ్జి అనే కారు అభిమానుల్లో ఎంతో ఆసక్తి రేపుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పటివరకూ ప్రభాస్, అమితాబ్, దీపికా పదుకొనే పోస్టర్లను మాత్రమే రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు ఈసినిమా నుండి వరుసగా పోస్టర్లను రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. దీనిలో భాగంగానే ఇప్పటికే శోభన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. మిరియం పాత్రలో నటిస్తుంది శోభన. ఇప్పుడు తాజాగా మరో పాత్రకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈసినిమాలో నటిస్తున్న అన్నా బెన్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. కైరా అనే పాత్రలో అన్నా బెన్ కనిపించనుంది.
కాగా ఈసినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో మరొక హీరోయిన్ బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటానీ కూడా నటిస్తుంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్, పశుపతి పలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి తోట రమణి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























