దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ అందరూ ఎదురుచూస్తున్న సైన్స్ ఫిక్షన్ ఎపిక్ ‘కల్కి 2898 AD’. పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించగా.. బాలీవుడ్ భామలు దీపికా పదుకొణే, దిశా పటానీ కథానాయికలుగా కనిపించనున్నారు. విజనరీ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ విజువల్ వండర్‌లో బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్, విశ్వ నటుడు కమల్ హాసన్, బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ, రాజేంద్రప్రసాద్, పశుపతి తదితరులు నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. ఈ మల్టీలింగ్వెల్, మైథాలజీ-ఇన్స్ స్పైర్డ్ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో తాజాగా మేకర్స్ ముంబైలో గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో కల్కి టీంతో హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి ఇంటరాక్షన్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది.
‘కల్కి 2898 AD’ యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది. కాగా ఈ ఈవెంట్లో ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. అమితాబ్ నిర్మాత అశ్వినీదత్ పాదాలను తాకబోయారు. అశ్వనీదత్ స్టేజ్ మీదికి రాగానే దగ్గరికి వెళ్లిన బిగ్ బి ముందుకు వంగి పాదాభివనందనం చేయబోయారు. దీంతో అశ్వినీదత్‌తో సహా అక్కడున్నవారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అయితే వెంటనే తేరుకున్న అశ్వినీదత్ బిగ్ బిని వారించారు. అంతేకాకుండా తాను కూడా వంగి అమితాబ్‌కు పాదాభివందనం చేశారు.
ఈ సందర్భంగా అమితాబ్ మాట్లాడుతూ.. అశ్వినీదత్ లాంటి నిర్మాతను తాను ఎప్పుడూ చూడలేదని, షూటింగ్ సందర్భంగా సెట్లో నటీనటులందరినీ బాగా చూసుకున్నారనిచెప్పారు. ఇక ఈ దృశ్యాన్ని చూసినవారంతా ఆశ్చర్యచకితులయ్యారు. ఇలా బడా నిర్మాత, స్టార్ నటుడు ఒకరికొకరు పరస్పరం గౌరవించుకోవడాన్ని చూసి కరతాళధ్వనులు చేశారు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























