రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడి మరో వారం రోజుల్లో థియేటర్లలోకి రానుంది.పాన్ వరల్డ్ మూవీగా వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.ఇక ఓవర్సీస్ లో నైతే కల్కి దుమ్ములేపుతుంది.అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్ లో వున్నాయి.ఇప్పటి వరకు అక్కడ అడ్వాన్స్ సేల్స్ 2.5మిలియన్ డాలర్ మార్క్ ను క్రాస్ చేసింది. రిలీజ్ టైం కు 3మిలియన్ మార్క్ ను చేరుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు.అయితే టార్గెట్ కూడా పెద్దగానే వుంది.అక్కడ బ్రేక్ ఈవెన్ కావాలంటే 50కోట్లపైనే రాబట్టాల్సివుంటుంది.బ్లాక్ బాస్టర్ టాక్ వస్తే ఈ టార్గెట్ పెద్ద కష్టమేమి కాకపోవచ్చు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ప్రస్తుతం కల్కి టీం ప్రమోషన్స్ తో బిజీ గా వుంది.నిన్ననే ముంబై లో ఈవెంట్ జరిపారు.అందులో రిలీజ్ ట్రైలర్ ను ప్రదర్శించారు.తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు.ఈ ఈవెంట్ లో రిలీజ్ ట్రైలర్ ను విడుదలచేయనున్నారు.నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈసినిమాలో అమితాబ్ బచ్చన్ ,కమల్ హాసన్, దీపికా పదుకొణె ,దిశా పటాని కీలక పాత్రల్లో నటించగా సంతోష్ నారాయణ్ సంగీతం అందించాడు.వైజయంతి మూవీస్ నిర్మించింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























