తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి లీడ్ రోల్ లో నటించిన మహారాజ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతుంది.నిన్నటితో ఈసినిమా 50కోట్ల గ్రాస్ మార్క్ ను క్రాస్ చేసింది.సూపర్ పాజిటివ్ రివ్యూస్ తోపాటు మౌత్ టాక్ కూడా తోడవ్వడంతో సెన్సేషన్ సృష్టిస్తుంది.ఫుల్ రన్ లో 100కోట్ల మార్క్ ను చేరుకున్న ఆశ్చర్య పోనక్కర్లేదు. విజయ్ సేతుపతి కెరీర్ లోనే మహారాజ బిగ్గెస్ట్ హిట్ గా నిలవనుంది.ఇది తనకు 50వ సినిమా కూడా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తమిళంలోనేకాదు తెలుగులో కూడా ఈసినిమా సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంది.నిన్నటి వరకు మహారాజా తెలుగు రాష్ట్రాల్లో 8కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుని బ్రేక్ ఈవెన్ ను మార్క్ ను క్రాస్ చేసింది.తెలుగులో ఈసినిమాను ఎన్వీ ప్రసాద్ విడుదలచేశారు.చాలా తక్కువకు ఈసినిమా థియేట్రికల్ హక్కులను దక్కించుకోవడంతో ఫుల్ రన్ లో భారీ లాభాలను ఖాతాలో వేసుకోనున్నారు.
నిథిలన్ స్వామినాథన్ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో మమతా మోహన్ దాస్ ,అనురాగ్ కశ్యప్,అభిరామి కీలక పాత్రల్లో నటించగా అజనీష్ లోకనాథ్ సంగీతం అందించాడు. సుదర్శన్ సుందరం, జగదీష్ పళనిస్వామి నిర్మించారు.థియేట్రికల్ రన్ తరువాత మహారాజ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























