తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా మారుమ్రోగుతున్న పేరు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఏడాది మే లో ఏపీ ఎన్ని కలు జరుగగా ఈ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. ఇక ఈ కూటమి ఏర్పడటానికి ప్రధాన కారకుడు పవన్ కళ్యాణ్ అవ్వడం.. కూటమి ఘన విజయం సాధించడంతో అతనిపై ప్రశంసలు కురుపిస్తున్నారు. దానికి తోడు పవన్ కళ్యాణ్ తీసుకుంది 21 సీట్లు మాత్రమే.. ఆ 21 సీట్లు అన్నీ కూడా విజయం సాధించడంతో దేశవ్యాప్తంగా టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా పవన్ గెలుపుపై మెగాఫ్యామిలీ ఎంత ఆనందంలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవన్ ప్రమాణ స్వీకారానికి సైతం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు. ఇప్పుడు మెగాస్టార్ చిరు మరో విషయాన్ని తెలియచేశారు. కళ్యాణ్ బాబుకు వదినమ్మ బహుమతి అంటూ సురేఖ, పవన్ కళ్యాణ్ కు ఇచ్చిన బహుమతిని చూపిస్తూ చిన్న వీడియోను పోస్ట్ చేశారు. సురేఖ, పవన్ కళ్యాణ్ కు పెన్ను ను బహకరించారు. తెలుగు ప్రజల ఆకాంక్షల్ని నిజం చేస్తావని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ వదిన, అన్నయ్య అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు.
ఇక ఇప్పటికే పవన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేసేశారు. మరోవైపు డిప్యూటీ సీఎం గా కూడా నియామకం అయ్యారు. ఇంకా పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను పవన్ కు కేటాయించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























