లారెన్స్ కాంచన 4 షురూ.. షూటింగ్ ఎప్పటినుంచంటే?

Raghava Lawrence Starring Kanchana 4 Shoot Commence This September,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2024,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Raghava Lawrence,Raghava Lawrence Movies,Raghava Lawrence New Movie,Raghava Lawrence Latest Movie,Raghava Lawrence Kanchana 4,Raghava Lawrence Kanchana 4 Movie,Kanchana 4,Kanchana 4 Movie,Kanchana 4 Telugu Movie,Kanchana 4 Movie Updates,Kanchana 4 Movie News,Kanchana 4 Movie Shooting Update,Kanchana 4 Movie Latest Shooting Update,Kanchana 4 Shooting Latest Update,Raghava Lawrence Kanchana 4 Movie Shooting Update

ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ కేవలం డాన్స్ మాస్టర్ గానే కాకుండా ఆల్ రౌండర్‌గా పేరు తెచ్చుకున్నారు. అనేక సినిమాలలో నటించడంతో పాటు కొన్నింటికి దర్శత్వం కూడా వహించి ఆయన సూపర్ హిట్స్ అందుకున్నారు. వీటిలో రాఘవ లారెన్స్ స్వయంగా నటించి దర్శకత్వం వహించిన ‘కాంచన’ సిరీస్ సినిమాలు ప్రత్యేకం. హారర్ ఎలెమెంట్స్‌కి కామెడీ జోడించి తీసిన ఈ సినిమాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభవాన్నిచ్చాయి. ఒకవైపు నవ్విస్తూనే మరోవైపు భయపెట్టడం ఈ చిత్రాల ప్రత్యేకత.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పటికే ఈ సిరీస్‍లో 3 చిత్రాలు రాగా అన్నీ విజయం సాధించాయి. ఈ క్రమంలో మరో మూవీకి శ్రీకారం చుట్టారు రాఘవ లారెన్స్. కాంచన సిరీస్‍లో భాగంగా 4వ సినిమాను తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది సెప్టెంబర్‌లో ‘కాంచన 4’ చిత్రం షూటింగ్ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. అలాగే ఈ మూవీకి కూడా లారెన్స్ స్వయంగా దర్శకత్వం వహించనున్నారని తెలిపారు. ఇక త్వరలోనే ఈ సినిమాలో నటించనున్న నటీనటులు మరియు పనిచేయనున్న సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడించనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.