సుందర్.సి దర్శకత్వంలో తమన్నా, రాశీఖన్నా ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా అరణ్మనై4. ఈ సినిమా సుందర్.సి దర్శకత్వంలో వచ్చిన హార్రర్ సిరీస్ అరణ్మనై ఫ్రాంచైజ్ లో నాలుగో పార్ట్ అన్న సంగతి తెలిసిందే. మొదటి రెండు పార్ట్ లు మంచి విజయాన్ని అందించినా మూడో పార్ట్ మాత్రం అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఇప్పుడు అరణ్మనై 4 వచ్చింది. మే 3వ తేదీన ప్రేక్షకుల ముందుక వచ్చింది ఈసినిమా. తెలుగులో బాక్ అనే టైటిల్ తో రిలీజ్ అయింది. ఇక ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందించింది. అంతేకాదు 100 కోట్ల కలెక్షన్స్ ను అందించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు ఈసినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్నారు. అయితే అప్పుడు రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఇప్పుడు తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. జూన్ 21వ తేదీన ఈసినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు రానుంది. తమిళ్ తో పాటు తెలుగు, కన్నడ, మలయాళంలో కూడా అందుబాటులోకి రానున్నట్టు తెలిపారు.
కాగా ఈసినిమాలో కోవై సరళ, యోగిబాబు,రాజేంద్రన్ కీలకపాత్రల్లో కనిపించారు. ఈసినిమాను కుష్బు సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్ నిర్మించారు. హిప్ హాఫ్ తమిళ సంగీతం అందించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































