కల్కి 2898 ఏడీ నుండి స్టార్ కిడ్స్ కు ప్రత్యేక కానుకలు

special gifts for star kids from kalki 2898 AD movie

ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న కల్కి 2898 ఏడీ సినిమాకు మరికొద్ది రోజులు మాత్రమే ఉంది. నాగ్ ఆశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, స్క్రాచ్ వీడియోస్, గ్లింప్స్ వీడియో, టీజర్ అన్నీ ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మరోవైపు జూన్ 27వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో జూన్ నెల కూడా మొదలవ్వడంతో కల్కి ప్రమోషన్స్ లో వేగం పెంచారు. సినిమాపై మరింత బజ్ ను క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే బుజ్జి కారుతో సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది. మరోవైపు బుజ్జి, భైరవ యానిమేటెడ్ సిరీస్‌ను కూడా విడుదల చేశారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగుతోపాటు ఇతర భాషల్లో యానిమేటెడ్‌ సిరీస్‌ సందడి చేస్తోంది.

ఇదిలా ఉండగా ప్రమోషన్ కార్యక్రమాల్లో కల్కి టీ కొత్త స్ట్రాటజీలను కూడా వాడుతుంది. దీనిలో భాగంగానే స్టార్ కిడ్స్ కు ప్రత్యేక కానుకలు పంపిస్తున్నారు. కల్కి 2898 ఏడీ థీమ్‌తో డిజైన్‌ చేసిన వస్తువులను రాంచరణ్‌ కూతురు క్లింకారా కొణిదెల, మహేశ్‌ బాబు కూతురు సితార అందుకున్నారు.

కాగా ఈసినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో మరొక హీరోయిన్ బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటానీ కూడా నటిస్తుంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్‌, పశుపతి పలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వైజయంతి మూవీస్‌ పతాకంపై అశ్వనీదత్‌ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి తోట రమణి ఆర్ట్‌ డైరెక్టర్‌ గా వర్క్ చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.