ఆరోజు ఇండియన్ తాత రికార్డులు బద్దలు కొడుతున్నాడు – అనిరుధ్ రవిచంద్రన్

Anirudh Ravichander Praises Kamal Haasan and Director Shankar

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ ఎస్. శంక‌ర్ కాంబినేష‌న్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌ మరియు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘భార‌తీయుడు 2’. కాజల్ అగర్వాల్ హీరోయిన్‍గా నటిస్తుండగా.. సిద్ధార్థ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ‘భార‌తీయుడు 2’ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియ‌న్ సురేష్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పి, సీడెడ్ హ‌క్కుల‌ను శ్రీల‌క్ష్మి మూవీస్ సంస్థ‌లు ద‌క్కించుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం చెన్నైలో సినీ ప్రముఖులు సమక్షంలో ఆడియో వేడుక‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ వేడుకకు హీరో శింబు, డైరెక్టర్ లోకేష్ కనకరాజ్, నెల్సన్, నిర్మాత ఏ ఎం రత్నం, ఏసియన్ సినిమాస్ సునీల్ నారంగ్, భరత్ నారంగ్ వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

ఈ సందర్భంగా ఈ సినిమాకు మ్యూజిక్ అందించిన సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ మాట్లాడుతూ.. ‘ఇండియన్ 2 సినిమాను చేసే అవకాశం ఇచ్చిన లైకా సుభాస్కరన్ గారికి థాంక్స్. శంకర్ గారు నా ఫేవరెట్ డైరెక్టర్. 3 సినిమా నాకు మొదటి ప్రాజెక్ట్. ఈ మూవీ నాకు 33వ ప్రాజెక్ట్. కమల్ హాసన్ గారితో విక్రమ్ చేశాను. మళ్లీ ఇండియన్ 2 చేశాను. ఇండియన్ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ గారు అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చారు. శంకర్ గారు ఈ సినిమాకు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని అనుకుంటున్నాను. జూలై 12న ఇండియన్ తాత రికార్డులు బద్దలు కొడుతున్నాడు’ అని పేర్కొన్నారు.

అలాగే నటుడు బాబీ సింహా మాట్లాడుతూ.. ‘కమల్ హాసన్ గారు లెజెండరీ యాక్టర్. ఆయనలా రాబోయే తరంలో ఎవరు నటిస్తారు? అన్నది చెప్పలేం. ఊహించలేం. ఇండియన్ 2 కోసం ఆయన పడ్డ కష్టం చూశాను. మేకప్‌తో అన్ని గంటలు సెట్స్ మీద ఎలా ఉన్నారో చూశాను. ఈ వయసులోనూ ఇంత డెడికేషన్‌తో పని చేయడం మామూలు విషయం. ఇండియన్ 2 అందరికీ గర్వకారణంగా నిలుస్తుంది’ అని అన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.