కమల్ హాసన్ నాకు గురువు లాంటి వారు – శింబు

Kamal Haasan is Like My Guru, Says Hero Simbu

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌ మరియు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘భార‌తీయుడు 2’. కాజల్ అగర్వాల్ హీరోయిన్‍గా నటిస్తుండగా.. సిద్ధార్థ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ కానుంది. ఈ మూవీ పాటలు సోనీ మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదలవుతున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ‘భార‌తీయుడు 2’ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియ‌న్ సురేష్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పి, సీడెడ్ హ‌క్కుల‌ను శ్రీల‌క్ష్మి మూవీస్ సంస్థ‌లు ద‌క్కించుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం చెన్నైలో సినీ ప్రముఖులు సమక్షంలో ఆడియో వేడుక‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ వేడుకకు హీరో శింబు, డైరెక్టర్ లోకేష్ కనకరాజ్, నెల్సన్, నిర్మాత ఏ ఎం రత్నం, ఏసియన్ సినిమాస్ సునీల్ నారంగ్, భరత్ నారంగ్ వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

ఈ సందర్భంగా హీరో శింబు మాట్లాడుతూ.. ‘నాకు ఇండియన్ సినిమా చాలా ఇష్టం. ఈ విషయాన్ని శంకర్ గారితో ఎన్నో సార్లు చెప్పాను. అసలు ఆ సినిమాను ఎన్ని సార్లు చూసి ఉంటానో లెక్క పెట్టలేదు. ఓ కమర్షియల్ సినిమా ఎలా ఉండాలి? అనే దానికి ఇండియన్ సినిమా ది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇండియన్ 2 అనౌన్స్మెంట్ తరువాత ఓ అభిమానిగా ఎంతో ఎగ్జైట్ అయ్యాను. కమల్ హాసన్ గారు నాకు గురువు లాంటి వారు. థగ్స్ లైఫ్ సినిమాలో ఆయనతో కలిసి నటిస్తున్నాను. ఇప్పటికీ ఆయన అదే డెడికేషన్‌తో పని చేస్తున్నారు” అని అన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “అందరికీ నచ్చేలా ఇండియన్ 2 ఉండబోతోంది. ఇండియన్ 2, ఇండియన్ 3, గేమ్ చేంజర్ లాంటి భారీ సినిమాలను ఒకే టైంలో తెరకెక్కించడం మామూలు విషయం కాదు. ఇది కేవలం శంకర్ గారి వల్లే సాధ్యం అవుతుంది. లైకా సుభాస్కరన్ గారు సౌత్‌లో భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు. రెడ్ జెయింట్ ఈ చిత్రయూనిట్‌కు ఎంతో సహకారాన్ని అందించారు. అనిరుధ్ పాటలు బాగున్నాయి. ఇండియన్ అనే టైటిల్‌కు తగ్గ నటుడు కేవలం కమల్ హాసన్. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలి” అని కోరారు హీరో శింబు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.