టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఖాతాలో మరో హిట్ పడిపోయింది. ఈ ఏడాది ఇప్పటికే గామి సినిమాతో డీసెంట్ హిట్ ను అందుకున్న విశ్వక్ ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో మరో హిట్ ను అందుకున్నాడు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రిలీజ్ కు ముందే ఈసినిమా అప్ డేట్లతో సినిమాతో మంచి బజ్ ను క్రియేట్ చేశారు. అలా ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా మే 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈసినిమా ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఇక కలెక్షన్స్ పరంగా అయితే ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను అందిస్తుంది. మొదటి రోజే ఈసినిమా 8 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఇక మూడు రోజుల్లో ఈసినిమా 16 కోట్లు వసూలు చేసినట్లు ప్రకటించారు. అంతేకాదు మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్‌ను కూడా పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది.
#GangsOfGodavari had a BLOCKBUSTER weekend at the box-office, grossed over 𝟏𝟔.𝟐 𝐂𝐑 in 3 Days! 💥🔥
Reignited the charm of the Single Screens! 💥
Don’t miss 𝐌𝐀𝐒𝐒 𝐊𝐀 𝐃𝐀𝐒 @VishwakSenActor 𝐑𝐀𝐌𝐏𝐀𝐆𝐄 at theatres near you! 💥🤩
Book your tickets now 🎟️ -… pic.twitter.com/NVnzvHv0km
— Sithara Entertainments (@SitharaEnts) June 3, 2024
కాగా ఈసినిమాలో నేహా శెట్టి, అంజలి హీరోయిన్లుగా నటించగా.. సాయి కుమార్, గోపరాజు రమణ కీలక పాత్రల్లో కనిపించారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. యువన్ శంకర్ రాజా ఈసినిమాకు సంగీతం అందించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























