కార్తికేయ 8వ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్

karthikeya 8th movie title and first look out now

ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరో కార్తికేయ. ఇక ఆసినిమా తరువాత కార్తికేయ వరుసగా సినిమాలు చేసుకుంటూ కెరీర్ లో దూసుకపోతున్నాడు. కేవలం హీరో పాత్రలే కాదు పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈమధ్య కాలంలో కార్తికేయకు మంచి హిట్ దక్కింది లేదు. దీంతో ఎలాగైనా ఒక సూపర్ హిట్ కొట్టాలన్న ఉద్దేశంతో ఉన్నాడు. ఈనేపథ్యంలోనే ఇప్పుడు మరో కొత్త సినిమాతో వస్తున్నాడు. ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా ఒక సినిమా రాబోతుంది. ఇది కార్తికేయకు 8వ సినిమా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా రంజాన్ పండుగ సందర్భంగా ఈసినిమా నుండి ప్రీ లుక్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు తాజాగా ఈసినిమా టైటిల్ ను, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. భజే వాయి వేగం అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. ఇక ఫస్ట్ లుక్ కూడా ఆకట్టుకుంటుంది.

కాాగా ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇంకా తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ హ్యాపీడేస్ రాహుల్ టైసన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ అనుబంధ సంస్థ యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ లో ఈసినిమాను నిర్మిస్తున్నారు. అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: ఆర్.డి రాజశేఖర్, సంగీతం రధన్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ – కపిల్ కుమార్ అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − seven =