దళపతి విజయ్ మాత్రం గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈసినిమా వస్తున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా షూటింగ్ కు సంబంధించి ఒక అప్ డేట్ తెరపైకి వచ్చింది. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ రష్యాలో ప్రారంభమైంది. ఈవిషయాన్ని చిత్ర నిర్మాత అర్చన కల్పాతి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. గోట్ మూవీ షూట్ రష్యా లోశరవేగంగా జరుపుకుంటుందని పోస్ట్ లో పేర్కొన్నారు.
కాగా సినిమాలో విజయ్ కు జోడీగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా స్నేహ, ప్రశాంత్, ప్రభుదేవా, జైరాం, లైలా, కమెడియన్, అజ్మల్, యోగిబాబు, వైభవ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అర్చన కల్పతి నిర్మిస్తున్నారు. యువన్‌శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: