ప్రభాస్‌ తో హను రాఘవపూడి పీరియాడిక్ మూవీ

Hanu Raghavapudi Upcoming Movie With Prabhas

ఫీల్ గుడ్ లవ్ స్టోరీలను తీయడంలో హను రాఘవపూడి ఎక్స్ పర్ట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందాల రాక్షసి సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు హను రాఘవపూడి. కృష్ణగాడి వీర ప్రేమగాథ’, ‘లై’, ‘పడి పడి లేచె మనసు’ ఇలా విభిన్నమైన సినిమాలు తీసి తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక సీతారామం సినిమాతో మరో మెట్టు ఎక్కేశాడు. దుల్కర్ సల్మాన్, మృణాల్ హీరో హీరోయిన్లు గా పీరియాడిక్ క్లాసిక్ లవ్ స్టోరీగా వచ్చిన ఈసినిమా క్లాసిక్ మూవీగా నిలిచి సంచలన విజయం సాధించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు హను రాఘవపూడి తన కొత్త సినిమాను ప్రకటించాడు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న హను రాఘవపూడి తన తరువాత సినిమా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఉందని అధికారికంగా ప్రకటించాడు. ప్రభాస్‌తో నా నెక్స్ట్ చిత్రం హిస్టరీ ఆల్టర్నేటివ్ నెరేటివ్ తో కూడిన పీరియాడికల్ యాక్షన్ మూవీ తీస్తున్నా అని స్పష్టం చేశారు. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న విశాల్ చంద్రశేఖర్ ఇప్పటికే మూడు పాటలను కంపోజ్ చేసినట్లు కూడా తెలియజేశారు.

ఈ డెడ్లీ కాంబినేషన్‌లో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తారు మేకర్స్.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 6 =