గత ఏడాది సామజవరగమన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న శ్రీవిష్ణు ఇప్పుడు ఓం భీమ్ బుష్ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. హుషారు ఫైమ్ శ్రీహర్ష కనుగంటి దర్శకత్వంలో శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా ఓం భీమ్ బుష్. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈసినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఈసినిమా ఓటీటీ లోకి కూడా వచ్చేస్తుంది. ఈసినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ వారు సొంతం చేసుకున్నారు. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు మేకర్స్. అమెజాన్ ప్రైమ్ లో ఏప్రిల్ 12వ తేదీన ఈసినిమా స్ట్రీమింగ్ ను రానుంది. మరి ఈ హిలేరియస్ ఎంటర్ టైనర్ ను థియేటర్ లో చూడనివారు ఓటీటీ లో చూసి ఎంజాయ్ చేసేయండి.
కాగా ఇంకా ఈసినిమాలో ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్, శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో నటించారు. యూవీ క్రియేషన్స్ సంస్థ సమర్పించిన ఈసినిమాను వి.సెల్యులాయిడ్తో కలిసి సునీల్ బలుసు నిర్మించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: