నవదీప్ లవ్‌ మౌళి ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Navdeep's Love Mouli Movie Theatrical Trailer to be Out Tomorrow

టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ నవదీప్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘లవ్‌ మౌళి’. ఇటీవల ఇతర హీరోల చిత్రాలలో కనిపిస్తున్న నవదీప్ కొంత విరామం తర్వాత ఇందులో సోలో హీరోగా నటిస్తుండటం విశేషం. వైవిధ్య‌మైన కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి అవ‌నీంద్ర ద‌ర్శ‌కత్వం వహిస్తున్నారు. నైరా క్రియేషన్స్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్‌‌తో క‌లిసి.. టాలీవుడ్ టాలెంటెడ్ టెక్నీషియన్స్‌కి అడ్డాగా మారిన సి స్పేస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు వ‌చ్చిన ప్రమోషనల్ కంటెంట్ వినూత్నంగా ఉండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ అప్డేట్స్ కోసం వారు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘లవ్‌ మౌళి’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. రేపు అనగా.. ఆదివారం (ఏప్రిల్ 09, 2024) ఈ మూవీ ట్రైలర్ విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.

ఈ మేరకు తాజాగా సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించింది. కాగా ఈ చిత్రంలో నవదీప్ చాలా డిఫ‌రెంట్‌గా కనిపించడంతో ఈ సినిమాను న‌వ‌దీప్ 2.O గా పిలవడం జరుగుతోంది. విభిన్న ప్రేమ‌క‌థ‌లు కోరుకునే ప్రేక్ష‌కులంద‌రికి ‘ల‌వ్‌ మౌళి’ మ‌న‌సుల‌కు హ‌త్తుకుంటుందని చిత్ర బృందం తెలిపింది. ఏప్రిల్ 19న ఈ సినిమా థియేటర్లలో విడుద‌ల కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × two =