ఎన్టీఆర్ ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తా – కోన వెంకట్

Kona Venkat Interesting Comments on NTR and Adhurs 2 Movie

టాలీవుడ్ స్టార్ రైటర్ కమ్ ప్రొడ్యూసర్ కోన వెంకట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. ఈ మేరకు ఆయన బుధవారం అంజ‌లి టైటిల్ రోల్‌లో న‌టిస్తున్న తాజా చిత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‍లో భాగంగా మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమాకు ఆయన క‌థ, స్రీన్ ప్లే అందించడంతోపాటు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మరియు ‘అదుర్స్ 2’పై కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే కోన వెంకట్ ఏమన్నారో? ఎందుకలా అన్నారో? ఆయన మాటల్లోనే చూద్దాం..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మాస్ మహారాజా రవితేజ హిట్ మూవీ ‘వెంకీ’కి సీక్వెల్ చేయాలనుకుంటున్నారా అని మీడియా ప్రతినిధి ఒకరు ప్రశ్నించగా.. కోన వెంకట్ ఇలా స్పందించారు. “వెంకీ 2 సంగతి తెలియదు కానీ.. పక్కాగా అదుర్స్ 2 చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నా. అదుర్స్ 2 కోసం ఎన్టీఆర్‌ను ఒప్పించేందుకు ప్రయత్నిస్తా. అవసరమైతే ఆయన ఇంటి ముందు టెంట్ వేసుకుని, పిలక పెట్టుకొని నిరాహార దీక్ష కూడా చేస్తా (నవ్వుతూ). నిరాహార దీక్ష చేసైనా సరే.. తారక్‌తో అదుర్స్ 2 చేయిస్తా. సీక్వెల్‌ని కూడా వినాయక్‌తోనే డైరెక్ట్ చేయిస్తా. చారి పాత్రకు తారక్‌ని తప్ప వేరొకరిని ఊహించుకోలేను. చారి పాత్రను ఎన్టీఆర్ తప్ప దేశంలో మరెవరూ చేయలేరు. ఆయన తప్ప మరెవ్వరూ ఆ పాత్రకు న్యాయం చేయలేరు” అని అన్నారు కోన వెంకట్.

కాగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా 2010లో వచ్చిన ‘అదుర్స్’ బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ డ్యుయల్ రోల్ చేయగా.. అందులో ప్రత్యేకంగా ‘చారి’ క్యారెక్టర్ ఐకానిక్‍గా నిలిచిపోయింది. ఆ పాత్రలో ఎన్టీఆర్ అభినయం, మేనరిజమ్స్ నభూతో.. అన్నట్టుగా ఉంటాయి. అలాగే ఎన్టీఆర్, బ్రహ్మానందం కాంబినేషన్‍లో వచ్చే కామెడీ సీన్స్ హైలైట్‍గా నిలిచాయి. ఈ చిత్రానికి కోన వెంకట్ రచయితగా వ్యవహరించారు. అయితే, అదుర్స్ సినిమాకు సీక్వెల్ వస్తే బాగుంటుందని మూవీ లవర్స్ ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కోన వెంకట్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 5 =