మంజుమ్మల్ బాయ్స్ ఎక్స్ ట్రార్డినరీ ఫిల్మ్

Producer Naveen Yerneni Reveals Interesting Facts About Manjummel Boys

ఈ ఏడాది బాక్సాఫీస్ దగ్గర రూ. 200 కోట్లు కలెక్ట్ చేసిన మొట్టమొదటి మలయాళ సినిమాగా ‘మంజుమ్మల్ బాయ్స్’ చరిత్ర సృష్టించింది. ఇది యదార్థంగా గుణ కేవ్స్‌లో జరిగిన సంఘటన స్ఫూర్తితో, కొచ్చికి చెందిన కొంత మంది స్నేహితుల కథను అద్భుతంగా చూపించిన మలయాళ సర్వైవల్ థ్రిల్లర్. ఈ చిత్రానికి చిదంబరం ఎస్ పొదువల్ దర్శకత్వం వహించారు. సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి ప్రధాన పాత్రలు పోషించారు. పరవ ఫిలింస్‌ పతాకంపై బాబు షాహిర్‌, సౌబిన్‌ షాహిర్‌, షాన్‌ ఆంటోని నిర్మించిన ఈ చిత్రం తమిళంలో కూడా మంచి విజయం సాధించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సర్వైవల్ థ్రిల్లర్‌ను తెలుగు ప్రేక్షకులకు ముందుకు తీసుకువస్తోంది. తెలుగు వెర్షన్‌ను నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పిస్తున్నారు. ఏప్రిల్ 6న తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలిజ్ ఈవెంట్‍ని నిర్వహించారు. నిర్మాతలు వివేక్ కూచిభొట్ల, శశిధర్ రెడ్డి, నవీన్ యెర్నేని, నిరంజన్ రెడ్డితో పాటు చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది.

ఇక ప్రీరిలీజ్ ఈవెంట్‍లో భాగంగా నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ.. “ఈ సినిమాని యుఎస్‍లో చూశాను. ఎక్స్‌ట్రార్డినరీ మూవీ. ఈ మధ్య కాలంలో చూసిన బెస్ట్ ఫిలిం. సినిమా యూనిట్ అందరికీ అభినందనలు. ఈ సినిమా ఇప్పటికే 200 కోట్లకు పైగా కలెక్ట్ చేసి బిగ్ హిట్ అయ్యింది. తెలుగులో కూడా పెద్ద విజయాన్ని సాధిస్తుంది. తెలుగు ప్రేక్షకులందరూ ఇష్టపడతారు. విజువల్స్, మ్యూజిక్ ఎక్స్‌ట్రార్డినరీ. ఏప్రిల్ 6న సినిమా రిలీజ్ చేస్తున్నాం. తప్పకుండా థియేటర్స్‌కి వచ్చి చూడండి. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు” అని అన్నారు.

అలాగే మరో నిర్మాత, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ.. ట్రెమండస్ సక్సెస్‍ని అందుకున్న ‘మంజుమ్మల్ బాయ్స్’ టీంకి అభినందనలు. తెలుగు రిలీజ్ కి ఆల్ ది బెస్ట్. మైత్రీ శశి గారు ఈ సినిమా రైట్స్ తీసుకున్నామని చెప్పారు. సినిమా గురించి చాలా గొప్పగా వింటున్నాని చెప్పాను. ఈ మధ్య మలయాళం చిన్న సినిమాలు మంచి విజయాలు సాధిస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళిన ‘ప్రేమలు’, ‘మంజుమ్మల్ బాయ్స్’ చూశారా? అని అడుగుతున్నారు. తెలుగులో కూడా ఇంకా మంచి సినిమాలు వస్తాయి. ఈ సినిమాలని ఆదరిస్తే అటువంటు ధైర్యం మనకీ వస్తుంది. టీం అందరికీ మరోసారి ఆల్ ది బెస్ట్’’ అని తెలిపారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 − one =