OG రిలీజ్ డేట్ పై మరోసారి నిర్మాత క్లారిటీ

dvv danayya once again gives clarity on og movie release date

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో ఓజీ సినిమా వస్తుంది. స్పై థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించనున్నాడు సుజీత్. ఈసినిమా ఇప్పటివరకూ ఈసినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై క్రేజ్ ను పెంచాయి. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ పూర్తయింది. పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉన్నా సుజీత్ మాత్రం మిగిలిన పోర్షన్స్ ను పూర్తిచేసేస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు ఈసినిమా రిలీజ్ డేట్ పై మరోసారి క్లారిటీ ఇచ్చాడు నిర్మాత దానయ్య. తాాజాగా ఓ సినిమా ఈవెంట్ లో పాల్గొన్న దానయ్య ఓజీ సినిమా రిలీజ్ గురించి మాట్లాడుతూ.. ఈసినిమా రిలీజ్ డేట్ ను ఇప్పటికే ప్రకటించగా.. చెప్పిన డేట్ కే అంటే సెప్టెంబర్ 27వ తేదీన తప్పకుండా ఈసినిమా రిలీజ్ అవుతుందని తెలిపారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయ పరంగా బిజీగా ఉన్నా ఎలక్షన్స్ ముగిసి కాస్త సద్దుమణిగిన తరువాత పవన్ మిగిలిన షూటింగ్ ను పూర్తి చేస్తారని తెలిపారు.

ఈసినిమాలో ప్రియాంక అరుళ్ హీరోయిన్ గా నటిస్తుంది. అర్జున్ దాస్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను డీవీవీ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.. రవి..కె.చంద్రన్ డీవోపీ అందిస్తున్నారు. తెలుగు తోపాటు హిందీ, మలయాళం, తమిళ్ మరియు కన్నడ భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో విడుదలకి సిద్ధమవుతోంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 10 =