ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వంలో కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో వస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా తీసుకు రాబోతున్నారు. అందులో మొదటి పార్ట్ ఏప్రిల్ రాబోతుంది. ఏప్రిల్ 5వ తేదీన ఈసినిమా రానుంది. రీసెంట్ గానే ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా ముగించుకుంటుంది
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు ఈసినిమా షూటింగ్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. ఈసినిమా షూటింగ్ ఏప్రిల్ చివరికల్లా పూర్తవనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈసినిమా టాకీ పార్ట్ తో పాటు.. డైలాగ్ వెర్షన్స్ ఇంకా మొత్తం ఫైట్లు అన్నీ కలిపి ఏప్రిల్ ఎండింగ్ వరకూ పూర్తవుతాయని.. కేవలం మూడు పాటలు మాత్రమే పెండింగ్ లో ఉంటాయని.. అవి జులై లో షూట్ చేస్తారని అంటున్నారు.
కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకర ప్రసాద్ ఎడిటర్ గా సబు సిరిల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: