మలయాళ ఇండస్ట్రీ హిట్ మంజుమ్మల్ బాయ్స్ తెలుగులో విడుదలవుతున్న విషయం తెలిసిందే. రేపు ఈసినిమా థియేటర్లోకి రానుండగా అంతకన్నా ముందే ఈరోజు పెయిడ్ ప్రీమియర్లు పడనున్నాయి.ఈ షో లకు మంచి రెస్పాన్స్ వస్తుంది.ఇక ఈసినిమా సెన్సార్ కంప్లీట్ అయ్యింది.క్లీన్ యు సర్టిఫికెట్ తో థియేటర్లలోకి రానుంది.రన్ టైం కూడా తక్కవగానే వుంది.2గంటల 15నిమిషాల నిడివి తో ప్రేక్షకులముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సర్వైవల్ థ్రిల్లర్ గా వచ్చిన ఈసినిమా సింగిల్ లాంగ్వేజ్ లోనే 200కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది.అయితే ఒక్క కేరళ లోనే కాదు తమిళనాడు లో 60కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి హైయెస్ట్ మాలీవుడ్ గ్రాసర్ గా రికార్డుల్లోకి ఎక్కింది.
ప్రముఖ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ ఈసినిమాను తెలుగులో విడుదలచేస్తుంది.కంటెంట్ తెలుగు వాళ్లకు కూడా కనెక్ట్ అవుతుందన్న నమ్మకంతో నిర్మాతలు ఫుల్ కాన్ఫిడెంట్ గా వున్నారు.ఇక గత నెలలో ప్రేమలు అనే మలయాళ సినిమాను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయగా ఏకంగా 15కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి షాక్ ఇచ్చింది. అంతేకాదు తెలుగులో అత్యధిక వసూళ్లను రాబట్టిన మలయాళ డబ్ సినిమాగా రికార్డు సృష్టించింది.మరి ఇప్పుడు మంజుమ్మల్ బాయ్స్ ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: