విజయ్ ఈ సినిమాలో 360 డిగ్రీస్ క్యారెక్టర్ చేశాడు – దిల్ రాజు

Family Star Movie Press Meet Producer Dil Raju Praises Vijay Deverakonda

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధానపాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఫ్యామిలీ స్టార్’. ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. ఈ  సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మించగా.. వాసు వర్మ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ చిత్రం ఏప్రిల్ 5న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో గ్రాండ్‌ రిలీజ్‍ అవుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు చిత్ర విశేషాలను వివరించారు. దిల్ రాజు ఏమన్నారో ఆయన మాటల్లోనే.. “పరశురామ్ మొదట ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా కథ చెప్పగానే అందులోని పాయింట్ నన్ను ఎగ్జైట్ చేసింది. మాములుగా నేను మేకింగ్ టైమ్ నుంచి థియేటర్‌లో రిలీజ్ అయ్యేవరకు ప్రతి సందర్భంలో సినిమాను చెక్ చేసుకుంటుంటా. ఈ క్రమంలోనే స్టోరీని డెవలప్ చేశాక మేమంతా ఇంప్రెస్ అయ్యాం. విజయ్, పరశురామ్ కలిసి ‘గీత గోవిందం’ లాంటి బ్లాక్ బస్టర్ చేశారు. ఈ సినిమా కూడా వాళ్ల కాంబినేషన్‌లో సక్సెస్ అవుతుందనే నమ్మకం ఏర్పడింది”.

“ఫ్యామిలీ స్టార్‌కు విజయ్ దేవరకొండ క్యారెక్టరైజేషన్ వెన్నెముక లాంటిది. విజయ్ నవ్విస్తాడు, ఏడిపిస్తాడు, ఫైట్ చేస్తాడు, ఫ్యామిలీ కోసం ఆలోచిస్తాడు, అమ్మాయిని ప్రేమిస్తాడు, ఆమెను ద్వేషిస్తాడు, రొమాన్స్ చేస్తాడు.. ఇలా అన్ని షేడ్స్ హీరో క్యారెక్టర్‌లో ఉన్నాయి. విజయ్ ఈ సినిమాలో 360 డిగ్రీస్ క్యారెక్టర్ చేశాడని చెప్పవచ్చు. ఇది కేవలం ఫ్యామిలీ స్టోరీ మాత్రమే కాదు లవ్ స్టోరీ కూడా ఉంటుంది. 30 పర్సెంట్ ఫ్యామిలీ స్టోరీ, 70 పర్సెంట్ లవ్ స్టోరీ ఉంటుంది. ‘శతమానం భవతి’ రిలీజైనప్పుడు యూత్ ఆడియెన్స్ సీరియల్‌లా ఉందని అన్నారు. కానీ ఫ్యామిలీస్ బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశారు”.

“సాధారణంగా ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు వివిధ రకాల స్పందనలు వస్తాయి. కానీ చివరకు అది ఇచ్చే బాక్సాఫీస్ రిజల్ట్ ఇంపార్టెంట్. ఏ సినిమా వందకు వందశాతం ప్రేక్షకులకు నచ్చదు. లోపాలు వెతికేవాళ్లు ఎప్పుడూ ఉంటారు. మాకు వంద మంది ప్రేక్షకుల్లో 75 మంది సినిమా నచ్చిందని చెప్పినా మేము ఫస్ట్ క్లాస్‌లో పాసయినట్లు భావిస్తాం. ఇక మా చిత్ర కథానాయిక మృణాల్ లక్కీ హీరోయిన్. తెలుగులో తను చేసిన సీతారామం, హాయ్ నాన్న సినిమాల సక్సెస్ తర్వాత.. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్‌తో హ్యాట్రిక్ అందుకోబోతోంది. మా సంస్థలో ఎన్నో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ వచ్చాయి. వీటి విషయంలో నా గురి ఎప్పుడూ తప్పలేదు. ఒక్క ‘శ్రీనివాస కల్యాణం’ సినిమా మాత్రమే అనుకున్నంత ఫలితం రాలేదు”.

“ఏప్రిల్ 5 నాకు ఎంతో స్పెషల్. ఆ రోజుతో ‘దిల్’ సినిమా రిలీజ్‍తో నేను రాజు నుంచి దిల్ రాజు అయ్యాను. అప్పటి నుంచి మొన్నటి ‘బలగం’ సినిమా వరకు మీరూ, ప్రేక్షకులూ ఎంతో సపోర్ట్ చేశారు. ఆ సపోర్ట్ ఇకపైనా కొనసాగాలి. మీడియా మిత్రులు వారి కుటుంబ సభ్యులతో ఒక గెట్ టు గెదర్ ఏర్పాటు చేస్తున్నాం. అలాగే మీడియా మిత్రుల ఫ్యామిలీస్ కోసం ఫ్యామిలీ స్టార్ స్పెషల్ షో అరేంజ్ చేస్తున్నాం. సినిమా ప్రమోషన్‌లో భాగంగానే ఎనర్జిటిక్‌గా పాటలు పాడుతున్నా, డ్యాన్సులు చేస్తున్నా. అంతేగానీ స్క్రీన్ మీద నటించే ఆలోచన లేదు” అని తెలిపారు దిల్ రాజు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − ten =