తొలిరోజు ఓవర్సీస్‌లో దుమ్మురేపిన టిల్లు స్క్వేర్

Tillu Square Collects Over 1.2 Million Gross in Overseas on First Day

టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన తాజా చిత్రం ‘టిల్లు స్క్వేర్’. గతంలో ఆయన హీరోగా నటించిన ‘డీజే టిల్లు’కి సీక్వెల్‍గా ఈ మూవీకి సిద్ధు జొన్నలగడ్డ కథనం, సంభాషణలు అందించగా.. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించగా.. మురళీధర్, ఆంథోనీ, సుజాత తదితరులు కీలక పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌,ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘డీజే టిల్లు’కి మించిన వినోదాన్ని అందించడానికి ‘టిల్లు స్క్వేర్’ చిత్రం శుక్రవారం (మార్చి 29, 2024) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ముందు నుంచీ ఊహించినట్టుగానే ఈ సినిమాకు తొలిరోజే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. దీంతో విడుదలైన అన్ని ఏరియాల్లో ఈ మూవీ దూసుకుపోతోంది. ఇక తెలుగురాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో సైతం అదిరిపోయే కలెక్షన్లతో దుమ్మురేపుతోంది. ఈ నేపథ్యంలో తొలిరోజే అక్కడ మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లను సాధించింది.

ఈ మేరకు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ‘టిల్లు స్క్వేర్’ చిత్రం 1.2 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిందని ప్రకటించింది. ఇక ఈరోజు, రేపు వీకెండ్ కావడంతో ఈజీగా 3 మిలియన్ డాలర్స్ వసూలు చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడం, దీనికితోడు పోటీగా మరే ఇతర సినిమాలు లేకపోవడం కలిసొచ్చే అంశాలుగా వారు చెబుతున్నారు. ప్రస్తుత జోరు చూస్తుంటే.. మొత్తానికి టిల్లు మరోసారి గట్టిగానే కొట్టేన్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + 19 =