దసరా కాంబో బ్యాక్- బ్లాస్టింగ్ అనౌన్స్ మెంట్

nani and srikanth odela movie official announcement

న్యాచురల్ స్టార్ నాని మాత్రం ఎలాంటి గ్యాప్ లేకుండా ఒక సినిమా తరువాత మరొక సినిమా చేసుకుంటూ వెళుతూనే ఉన్నాడు. గత ఏడాది దసరా, హాయ్ నాన్న సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా రాబోతున్న సినిమా సరిపోదా శనివారం. ఈసినిమాతో ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో రాబోతున్నాడు నాని. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇంకా సుజీత్ దర్శకత్వంలో, కూడా ఒక సినిమా చేస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో దసరా సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఇప్పుడు ఇద్దరూ మరో సినిమాతో వచ్చేస్తున్నారు. ఇక తాజాాగా ఈసినిమాకు సంబంధించిన అప్ డేట్ వచ్చింది. దసరా రిలీజ్ అయి ఏడాది అయిన సందర్భంగా ఈసినిమాను అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు ఈసినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. కాగా ఈసినిమాను ఎస్వీఎల్ సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈసినిమాలో నటించే నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో తెలియచేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 15 =