విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ రిలీజ్

vijay deverakonda family star movie trailer out now

తన నటనతో, యాటిట్యూడ్ తో తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు రౌడీహీరో విజయ్‌ దేవరకొండ. సినిమా జయాపజయాలకు సంబంధం లేకుండా తన క్రేజ్ ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఫ్లాప్స్ అందుకున్న తరువాత గత ఏడాది ఖుషి సినిమాతో డీసెంట్ హిట్ ను అందుకున్నాడు. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ అంటూ మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. పరశురాం డైరెక్షన్ లో గీతా గోవిందం తర్వాత విజయ్ చేస్తున్న మూవీ కావడంతో చిత్రం పై అంచనాలు కూడా భారీగా ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా ఏప్రిల్ 5 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఇప్పటికే టీజర్ ను పలు పాటలను రిలీజ్ చేయగా అన్నీ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ కూడా ఆకట్టుకుంటుంది. విజయ్ దేవరకొండ యాక్టింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్నీ హైలెట్ గా నిలిచాయి.

కాగా ఈసినిమాలో సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ ఈసినిమాను నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + nineteen =