దేవర గోవా షెడ్యూల్ కంప్లీట్ 

Devara Goa schedule is completed

ఎన్టీఆర్ ,కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న దేవర పార్ట్ 1 గోవా షెడ్యూల్ నిన్నటి తో ముగిసింది.ఈ షెడ్యూల్ లో కొన్ని కీలక మైన సన్నివేశాలతో పాటు ఓ మోంటేజ్ సాంగ్ ను చిత్రీకరించారు.ఇక తరువాతి షెడ్యూల్ హైదరాబాద్ లో ఏప్రిల్ లో జరుగనుంది. మే చివరి కల్లా సినిమా షూటింగ్ పూర్తి  కానుంది.విఎఫ్ఎక్స్ వర్క్ కూడా ఎక్కువగానే ఉండనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ లో కనిపించనున్నాడు.యువసుధ ఆర్ట్స్ ,ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.దసరా కానుకగా అక్టోబర్ 10న దేవర మొదటి భాగం విడుదలకానుంది.

ఈసినిమాను పూర్తి చేసి ఎన్టీఆర్,వార్ 2 లో జాయిన్ కానున్నాడు.ఎన్టీఆర్ కు ఇదే మొదటి  హిందీ సినిమా కానుంది.అయాన్ ముఖర్జీ ఈసినిమాను  తెరకెక్కించనుండగా హృతిక్ రోషన్ మరో హీరోగా నటించనున్నాడు.భారీ బడ్జెట్ తో యాష్ రాజ్ ఫిలిమ్స్ ఈసినిమాను నిర్మించనుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − fourteen =