బాణం, సోలో, ప్రతినిధి, అసుర వంటి సినిమాలతో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు రోహిత్. ఇప్పుడు మూర్తి దేవగుప్తపు దర్శకత్వంలో నారాా రోహిత్ హీరోగా ఒక సినిమా వస్తుంది. ప్రతినిధి 2 అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. ప్రతినిధి సినిమాకు సిరీస్ గా ఈసినిమా వస్తున్నట్టు టైటిల్ ను బట్టి అర్థమవుతుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా కాన్సెప్ట్ టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్సే వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా టీజర్ రిలీజ్ కు టైమ్ ను ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే కదా. రేపు అంటే మార్చి 29వ తేదీన ఉదయం 10 గంటల 8 నిమిషాలకు టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు మరో అప్డేట్ వచ్చింది. ఈసినిమా టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.
The 𝐌𝐄𝐆𝐀 Update is here!! 🤩
𝐌𝐄𝐆𝐀𝐒𝐓𝐀𝐑 @KChiruTweets garu is going to launch the 𝐓𝐄𝐀𝐒𝐄𝐑 of #Prathinidhi2 🔥#Prathinidhi2Teaser will be out 𝐓𝐎𝐌𝐎𝐑𝐑𝐎𝐖 at 10:08 AM!💥@IamRohithNara @murthyscribe @SagarMahati @TSAnjaneyulu1 @Nchamidisetty @Kumarraja423 pic.twitter.com/Wp4akzgLAW
— Vanara Entertainments (@VanaraEnts) March 28, 2024
కాగా వానర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈసినిమాను కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, కొండకళ్ల రాజేందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తుండగా, నాని చమిడిశెట్టి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. కాగా పొలిటికల్ థ్రిల్లర్ ప్రతినిధి సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. యూనిక్ కథ, గ్రిప్పింగ్ కథనంతో అందరి ప్రశంసలు అందుకుంది. మరి ఈసినిమా ఎలాంటి విజయాన్ని దక్కించుకుంటుందో చూద్దాం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: