రౌడీబాయ్స్ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆశిష్. ఆ సినిమా మంచి హిట్ నే అందించింది. ఆ తరువాత సెల్ఫిష్ అనే సినిమాతో రాగా ఆ సినిమా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. ప్రస్తుతం అయితే పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు ఆశిష్. అందులో లవ్ మీ సినిమా ఒకటి. అరుణ్ భీమవరపు దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. మరోవైపు ఈసినిమా నుండి వరుసగా అప్ డేట్లను ఇస్తూనే ఉన్నారు. ఈమధ్యే ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఏప్రిల్ 25వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. అంతేకాదు ఇప్పటికే ఫస్ట్ సింగిల్ కు సంబంధించిన అప్ డేట్ కూడా ఇచ్చారు. త్వరలో ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా నుండి మరో అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. ఈసినిమా షూటింగ్ పూర్తయినట్టు తెలిపారు చిత్రబృందం.
#LoveMe – ‘𝑰𝒇 𝒚𝒐𝒖 𝒅𝒂𝒓𝒆’ shoot wrapped up ❤️🔥❤️🔥
All set to entertain you with ‘Romantic chills’ in theatres from 𝐀𝐏𝐑𝐈𝐋 𝟐𝟓𝐭𝐡 𝐰𝐨𝐫𝐥𝐝𝐰𝐢𝐝𝐞 💓#GhostLove 💘@AshishVoffl @iamvaishnavi04 @mmkeeravaani @pcsreeram #ArunBhimavarapu @artkolla @HR_3555… pic.twitter.com/jzCzXMtHHV
— Dil Raju Productions (@DilRajuProdctns) March 28, 2024
కాగా బేబి ఫేమ్ వైష్ణవి చైతన్య ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈసినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హన్షిత రెడ్డి నిర్మిస్తున్నారు. ఎం. ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా లెజెండరీ కెమెరామెన్ పీసీ శ్రీరాం సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. అలాగే కొల్లా అవినాష్ ఆర్ట్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: