మరో వారం రోజుల్లో ఫ్యామిలీ స్టార్ థియేటర్లోకి రానుంది.నిన్న విడుదలచేసిన ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడం తో సినిమా పై అంచనాలు మరింత గా పెరిగిపోయాయి.ముఖ్యంగా విజయ్ దేవకొండ ,మృణాల్ ఠాకూర్ ల కెమిస్ట్రీ సినిమాకు కీలకం కానుంది.ట్రైలర్ చూస్తే కామెడీ ,యాక్షన్ ,రొమాన్స్,ఎమోషన్స్ ను పర్ఫెక్ట్ గా మిక్స్ చేసి పక్కాగా బరిలోకి దిగుతుందని అనిపిస్తుంది.మొత్తానికి విడుదలకు ముందు సాలిడ్ బజ్ ను క్రీయేట్ చేసింది.ఇక ఈసినిమా మరో సెంటిమెంట్ కూడా కలిసొస్తే తిరుగుండదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అదేంటంటే ఏప్రిల్ 5, 2003 లో దిల్ సినిమా విడుదలైయింది.ఈసినిమా సూపర్ హిట్ అయ్యి నిర్మాత రాజును దిల్ రాజు చేసింది. అప్పటి నుండి దిల్ రాజు వెనుతిరిగి చూసుకోలేదు.ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ కూడా ఆయనే నిర్మాత.అంతేకాదు దిల్ వచ్చిన డేట్ కే ఫ్యామిలీ స్టార్ వస్తుంది.మరి ఈ లక్కీ డేట్ ఫ్యామిలీ స్టార్ కు కూడా కలిసొస్తుందో చూడాలి.
పరుశురాం డైరెక్ట్ చేసిన ఈసినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా గోపి సుందర్ సంగీతం అందించాడు. ఈసినిమా తెలుగు తోపాటు తమిళం లో మాత్రమే విడుదలవుతుంది.థియేట్రికల్ రిలీజ్ తరువాత ఫ్యామిలీ స్టార్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ లోకి రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: