గేమ్ ఛేంజర్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ చెప్పేసిన తమన్

thaman revealed game changer first single release date

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ గేమ్ ఛేంజర్ అప్డేట్ కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు.అప్పుడెప్పుడో క్రిస్మస్ కి ఫస్ట్ సాంగ్ వదులుతామని మేకర్స్ ప్రకటించారు కానీ ఏమైందో తెలియదు కానీ ఆ సాంగ్ ఇప్పటివరకు బయటికి రాలేదు.ఇక ఎట్టకేలకు ఫస్ట్ సాంగ్ విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది.ఈనెల 27న రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా సాంగ్ ను రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారట ఈ విషయాన్ని స్వయంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వెల్లడించాడు.ఓషో కి గెస్ట్ గా వెళ్లిన తమన్ ఈ సాంగ్ గురించి అప్డేట్ ఇచ్చాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మరి ఈసారి కూడా చివరి నిమిషంలో వాయిదా వేస్తారో లేదా సాంగ్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ ను ఖుషి చేస్తారో చూడాలి.ఇక ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం వైజాగ్ లో జరుగుతుంది.రామ్ చరణ్ తో పాటు హీరోయిన్ కియారా అద్వానీ కూడా షూటింగ్ లో పాల్గొంటుంది.అన్ని కుదిరితే సినిమాను సెప్టెంబర్ లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.సోషల్ మెసేజ్ తో తెరకెక్కుతున్నఈసినిమాలో శ్రీకాంత్, శ్యామ్,అంజలి కీలక పాత్రల్లో నటిస్తుండగాభారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్నాడు.

ఇక ఈసినిమాను ఫూర్తి చేసి మే నుండి తన 16వ సినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నాడు రామ్ చరణ్. ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు డైరెక్షన్ లో రూరల్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కనున్న ఈసినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ నటించనుండగా ఏఆర్ రహెమాన్ సంగీతం అందిస్తున్నాడు.వృద్ధి సినిమాస్ ,మైత్రి మూవీ మేకర్స్,సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్నాయి.చరణ్ బర్త్ డే రోజున ఈసినిమా నుండి కూడా అప్డేట్ రానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + two =