గొప్ప మనసు చాటుకున్న సాయి ధరమ్ తేజ్

Sai Dharam Tej Helped Two Orphan Children For The Treatment

టాలీవుడ్ సుప్రీం హీరో, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.. రీల్ లైఫ్ లోనే కాదు, రియల్ లైఫ్ లోనూ హీరోనే అని అనేక పర్యాయాలు నిరూపించుకున్నాడు. అవసరాల్లో ఉన్నవారికి తన వంతు బాధ్యతగా సాయమందించి గొప్ప మనసుని చాటుకున్నాడు. మేనమామ, మెగాస్టార్ చిరంజీవి వలే సమాజ సేవలో పాలుపంచుకుంటూ సాటి హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇక గతేడాది తన జన్మదినం (అక్టోబర్ 15) సందర్భంగా.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆర్మీ అధికారుల కుటుంబాలకు, అలాగే రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులకు రూ.10 లక్షలు చొప్పున విరాళం అందించిన సంగతి గుర్తుండే ఉంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ క్రమంలో తాజాగా సాయి ధరమ్ తేజ్ మరోసారి తన ఉదారతను చాటుకున్నాడు. తాజాగా ఇద్దరు అనాధ పిల్లల ట్రీట్‌మెంట్‌కు సాయం అందించి మ‌రోసారి మానవత్వం చాటుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల ఒక అనాధ శరణాలయం నుండి ఆయనకు ఫోన్ వచ్చింది. అక్కడ ఆశ్రయం పొందుతున్న ఇద్దరు చిన్నారులకు ఆరోగ్య కారణాల రీత్యా ఖరీదైన ట్రీట్‌మెంట్‌ చేయాలని, అందుకు సాయం కావాలంటూ విజ్ఞప్తి అందింది. దీంతో వెంటనే స్పందించిన సాయి ధరమ్ తేజ్.. ఆ చిన్నారులకు సాయం అందించడానికి ముందుకొచ్చాడు. ఈ విష‌యాన్ని టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ ఆండ్రూ బాబు సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ప్ర‌స్తుతం ఈ పోస్ట్ వైర‌ల్‌గా మారింది.

కాగా ఆయన రెండేళ్ల క్రితం బైక్ యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయం నుంచి బయట పడిన విషయం తెలిసిందే. సాయి ధరమ్ తేజ్ గతేడాది ‘విరూపాక్ష’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంయుక్తా మీనన్ కథానాయికగా నటించింది. ఈ మూవీతో తేజ్ తొలిసారిగా రూ.100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టాడు. ఇక తాజాగా ఆయన సంపత్‌ నంది దర్శకత్వంలో ‘గాంజా శంకర్‌’ అనే మూవీ చేస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవలే ‘గాంజాశంకర్‌ ఫస్ట్‌ హై’ పేరుతో యూట్యూబ్‌లో రిలీజైన వీడియో సూపర్ రెస్పాన్స్ అందుకుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − four =