చాలా రోజులనుండి ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు హీరో గోపిచంద్.ప్రస్తుతం ఈహీరో చేతిలో రెండు సినిమాలు వున్నాయి అందులో భీమా ఒకటి.షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.పోస్ట్ ప్రొడక్షన్ స్టేజి లో వుంది.ఇప్పటివరకు రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ కూడా ఓకే అనిపించింది.అసలైన బజ్ ను పెంచే ట్రైలర్ రేపు విడుదలకానుంది.రేపు సాయంత్రం నాలుగు గంటలకు ఈ ట్రైలర్ విడుదలకానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.ఈసందర్బంగా విడుదలచేసిన పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా వుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
#BhimaaTrailer Releasing Tomorrow From 4pm..! pic.twitter.com/iD1dPUDSrm
— Gopichand (@YoursGopichand) February 23, 2024
యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈసినిమాలో గోపీచంద్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు.కన్నడ దర్శకుడు హర్ష ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది.రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నాడు.సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నాడు.శివరాత్రి సందర్భంగా మార్చి 8న భీమా థియేటర్లలోకి రానుంది.
ఇక గోపిచంద్ ఈసినిమాతో పాటు శ్రీను వైట్ల తో కూడా సినిమా చేస్తున్నాడు.రీసెంట్ గానే ఇటలీలో ఓ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది.గత కొంత కాలంగా శ్రీను వైట్ల కు సరైన సక్సెస్ లేదు దాంతో ఈసినిమాతో హిట్ కొట్టి మళ్ళీ ఫామ్ లోకి రావాలనే చూస్తున్నాడు.సినిమా కూడా తనకు కలిసొచ్చిన జోనర్ లోనే తెరకెక్కిస్తున్నాడు.ఈసినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుంది.త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: