గత ఏడాది నాచురల్ స్టార్ నానికి బాగా కలిసొచ్చింది.సమ్మర్ లో దసరాతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టగా చివర్లో హాయ్ నానితో మరో హిట్ అందుకున్నాడు.ఈసినిమా తరువాత నాని ప్రస్తుతం సరిపోదా శనివారం అనే సినిమాలో నటిస్తున్నాడు.వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేస్తున్నాడు.ఈసినిమాతో వివేక్ మొదటి సారి యాక్షన్ జోనర్ లోకి మారాడు.తన నుండి వస్తున్న మొదటి యాక్షన్ ఎంటర్టైనర్ ఇదే.ఇక ఈ శనివారం నాని తన పుట్టిన రోజును జరుపుకోనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసందర్భంగా టీం సప్రైజ్ ప్లాన్ చేసింది.సరిపోదా శనివారం నుండి గ్లింప్స్ ను విడుదలచేయనున్నారు.యాక్షన్ ప్యాకడ్ గా రానున్న ఈ గ్లింప్స్ అదిరిపోనుందని టాక్.దీనితో సినిమాకు వున్న హైప్ పెరుగుతుందని టీం భావిస్తుంది.ఈసినిమాలో నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తుండగా జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు.డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.
ఇప్పటికే ఈసినిమా థియేట్రికల్ రైట్స్ కూడా అమ్ముడైపోయాయి.తెలంగాణ,ఆంధ్రా కుగాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈసినిమా రైట్స్ ను దక్కించుకున్నాడు.ఈఏడాది చివర్లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: